అనాథ, బడిబయటి పిల్లలను గుర్తించాలి
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:23 PM
జిల్లాలో ఉన్న అనాథ, బడి బయటి బాలలను గుర్తించడానికి ప్రతీ గ్రామంలో ఆశ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, అంగన్ వాడీ టీచర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గం గ్వార్ సూచించారు.
- అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
నారాయణపేట టౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న అనాథ, బడి బయటి బాలలను గుర్తించడానికి ప్రతీ గ్రామంలో ఆశ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, అంగన్ వాడీ టీచర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గం గ్వార్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఐసీపీఎస్ చైల్డ్‌లైన్ సిబ్బంది, జిల్లా విద్యాధికారి, జిల్లా వైద్యాధికారి, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా గ్రామం లో ఉన్నటువంటి అనాథ కుటుంబాలను గుర్తిం చి అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల డేటాను సేకరించాలన్నారు. ఆ డేటాను విజన్ ఎన్జీవో అభివృద్ధి చేసినటువంటి ఆన్‌లైన్ లింకులో అప్‌లోడ్ చేయాలన్నారు. ఆన్‌లైన్ లింకుకు సంబంధించి విజన్ సంస్థ ట్రైనింగ్ నిర్వ హించి వారంలోపల ఆన్‌లైన్ లింకులో అప్ లోడ్ అయ్యేవిధంగా షెడ్యూల్ చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజులు జిల్లాలో ఉన్న నిరక్షరాస్యులను అక్షరా స్యులుగా మార్చేందుకు డీఆర్‌డీఏ, అంగన్‌వాడీ కార్యకర్తలు, మెప్మా, విద్యాశాఖ తరపున వలం టీర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ మొగులప్ప, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్ర మోహన్, డీఎల్‌పీవో సుధాకర్‌రెడ్డి, జీసీడీవో నర్మద, డీపీవో భిక్షపతి, చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డి నేటర్ నరసింహ, ఏపీవో అనిల్‌కుమార్, సీడీపీ వోలు పాల్గొన్నారు.