హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుతో అవకాశాలు
ABN , Publish Date - May 16 , 2025 | 11:45 PM
హ్యాం డ్లూమ్(చేనేత) టెక్నాలజీ కోర్సుతో భవిష్యత్‌లో యువతీయువకులకు మెరుగైన ఉపాధి అవకా శాలు లభిస్తాయని ప్రత్యేక అధికారి టీఎస్‌సీవో రతన్‌కుమార్ అన్నారు.
ప్రత్యేక అధికారి రతన్‌కుమార్
గద్వాల టౌన్, మే 16 (ఆంధ్రజ్యోతి): హ్యాం డ్లూమ్(చేనేత) టెక్నాలజీ కోర్సుతో భవిష్యత్‌లో యువతీయువకులకు మెరుగైన ఉపాధి అవకా శాలు లభిస్తాయని ప్రత్యేక అధికారి టీఎస్‌సీవో రతన్‌కుమార్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం టెక్నా లజీలో మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టె క్నాలజీ కోర్సు ప్రవేశాల కోసం చేనేత మరియు జౌళి శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ని జిహ్యేశ్వర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ప్రత్యేక అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుకు 60శా తం సీట్లు రాష్ట్రంలో చదివే విద్యార్థులకు కేటా యించారన్నారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మూడు సంవత్సరాల కోర్సు, ఇంట ర్ పాసైన విద్యార్థులకు రెండు సంవత్సరాల కోర్సు ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు ప్రతి నెల రూ.2,500లు స్టైఫండ్ అందిస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌డీసీ పథకం కింద నెలకు రూ.5వేలు అదనపు స్టైఫండ్ ఇ స్తుందని వివరించారు. దీంతోపాటు ప్రతీ సంవ త్సరం రెండుజతల యూనిఫాం ఉచితంగా అం దజేస్తారన్నారు. అర్హత గల విద్యార్థులు ఈనెల 25వరకు దరఖాస్తులను అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్, గద్వాల వారిని ఇవ్వాల న్నారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, డీవో సు ధారాణి, ఏడీవో ప్రియాంక, ఏడీవో ఉపేందర్, క్లస్టర్ సీడీఈ మహేశ్, చేనేత మాజీ ఆప్కో డైరెక్టర్ గట్టు వీరన్న, రాజోలి, అయిజ, గొర్లఖాన్ దొడ్డి, మల్లంపల్లి, గట్టు, ఎక్లాస్‌పురం గ్రామాల చేనేత సంఘం నాయకులు, కార్మికులు ఉన్నారు.