ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:33 PM
మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం చేప ట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివే యాలని ప్రజాసంఘాలు, పార్టీ నాయకులు డి మాండ్ చేశారు.
- ప్రజా సంఘాలు, పార్టీ డిమాండ్
- వరంగల్ సభ పోస్టర్ల విడుదల
గద్వాల టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం చేప ట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివే యాలని ప్రజాసంఘాలు, పార్టీ నాయకులు డి మాండ్ చేశారు. ఆపరేషన్ కాగార్‌కు వ్యతిరేకం గా 24న వరంగల్‌లో నిర్వహించే సభను విజ యవంతం చేయాలన్నారు. వరంగల్ సభ పోస్ట ర్లను బుధవారం పట్టణంలోని కార్యాలయం వ ద్ద వివిధ పార్టీలు, ప్రజా నాయకులు విడుదల చేశారు. ఈసందర్బంగా వారు మాట్లా డుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధం గా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అమా నుష మన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్, మహ దేవ్, చైతన్య మహిళా సంగం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, రేవతి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ శంకర ప్రభాకర్, నాగరాజు, తెలంగా ణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గో పాల్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉ ద య్‌కిరణ్, ప్రకాష్, ప్రభాకర్ శాస్ర్తి, ప్రభుదాస్, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, పీడీ ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా, పీవై ఎస్ నాయకులు బీరెల్లి దానయ్య, ఐఎఫ్‌టీయూ నాయకుడు కార్తీక్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజ నేయులు, జేఏసీ నాయకులు మధుసూదన్‌బా బు, బహుజన రాజ్యసమితి నాయకులు వాల్మీకి, వినోద్‌కుమార్ ఉన్నారు.