Share News

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:19 PM

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నాగర్‌దొడ్డి వెంకట్రాములు డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి
గద్వాల పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహిస్తున్న అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు

- బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నాగర్‌దొడ్డి వెంకట్రాములు

- గద్వాల పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా

గద్వాల టౌన్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నాగర్‌దొడ్డి వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌కు కగార్‌ను నిరసిస్తూ వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా చేశారు. ఈ సందర్బంగా సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, వెంకటస్వామి మాట్లాడారు. విలువైన ఆటవీ సంపదను పెట్టుబడిదారులు, కార్పొరేట్లపరం చేసేందుకు కేంద్రం ప్రభుత్వ ఎత్తుగడలో భాగమే ఆపరేషన్‌ కగార్‌ అని ఆరోపించారు. మావోయిస్టుల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతంలో అనాదిగా నివసిస్తున్న ఆదివాసీలపై సాగుతున్న ఊచకోత మానవత్వాన్ని మంటగలిపేదిగా ఉందన్నారు. వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, లేకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్‌, బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ కురువ పల్లయ్య, సీపీఐ-ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఏఐకేఎస్‌, సీఐటీయూ, ఏఐఎస్‌ఎఫ్‌, బీఆర్‌ఎస్‌ సంఘాల నాయకులు గోపాల్‌రావు, జి.గోపాల్‌, ఆశన్న, వాల్మీకి, రంగన్న, నరసింహులు, ప్రవీణ్‌, ధర్మన్న, తిమ్మప్ప, చిన్న, మస్తాన్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:19 PM