విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:21 PM
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
గద్వాలక్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీసులు విధి నిర్వహణలో వినియోగించే వివిధ ఆయుధాలు, అత్యవసర సమయంలో ఉపయోగించే పనిముట్ల గురించి గద్వాల అదనపు ఎస్పీ కె.శంకర్ వివ రించారు. బాంబులను కనుక్కోవడం, దొంగల వేలిముద్రలను గుర్తించడం, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలను కనుగొనే జాగిలాల పనితీరును, షీటీం, భరోసా, ట్రాఫిక్, సైబర్ నేరాల నియంత్రణ విభాగాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, ఆర్‌ఐ వెంకటేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.