Share News

వందశాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:28 PM

ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు, వంద శాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించుకోవాలని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ పిలుపునిచ్చారు.

వందశాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలి

- మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌

భూత్పూర్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు, వంద శాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించుకోవాలని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల, కార్యక్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల పాలనతో ప్రజలు వేశారి పోయారని, మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన గుర్తుచేశారు. ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటే ఏమిటో ఇప్పుడు అర్థం అవుతోందని, ఈ సమయంలో మనం వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. సీనియర్‌ నాయకుడు మురళిధర్‌గౌడ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామన్న ఆలోచనతో బాధపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, బీమా వంటి పథకాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రతీ గ్రామంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మెజార్టీతో గెలుపించుకోవాలని కార్యక్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు సత్యనారాయణ, నారాయణగౌడ్‌, ఫసీయోద్దిన్‌, లక్ష్మయ్య, తాటిపర్తి మాజీ సర్పంచ్‌ ఆకుల వెంకటయ్య, యాదయ్య, పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:28 PM