ఐదు తరగతులకు ఒకే టీచరు
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:26 PM
ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు ఉండటంతో బోధన సక్రమంగా సాగడం లేదు.
- బస్వాపురం ప్రభుత్వ పాఠశాల దుస్థితి
అలంపూరు చౌరస్తా, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఆ పాఠశాలలో 5 తరగతులున్నాయి. 45 మంది విద్యార్థులున్నారు. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు ఉండటంతో బోధన సక్రమంగా సాగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలంలోని బస్వాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండేవారు. ఇటీవల ఉపాధ్యాయిని అరుణకుమారి పదోన్నతిపై గట్టు మండలం, మాచర్ల ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లింది. దీంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు జ్యోతి 5 తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.