దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:15 PM
దేశం కోసం ప్రాణ త్యాగాని కైనా సిద్ధం కావాలని, దేశ రక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు.
- ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో పేటలో తిరంగా ర్యాలీ
నారాయణపేటటౌన్, మే 23 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణ త్యాగాని కైనా సిద్ధం కావాలని, దేశ రక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు. ‘మన దేశం కోసం సైనికులకు వందనం’ అనే ప్రత్యేక కార్యక్రమంతో నారాయణ పేట జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు. మెయిన్ చౌక్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ర్యాలీని నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ రక్షణ ప్రథమ కర్తవ్యంగా ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛ హక్కులు కల్పించారన్నారు. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలకు హడలెత్తించేలా చేశారన్నారు. పహల్గాం ఉగ్రదాడుల్లో అమాయక యాత్రికులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షు డు సత్యయాదవ్, రతంగపాండు రెడ్డి, శ్రీనివాసులు, పి.వినోద్, నందు, నామా జీ, రఘురామయ్యగౌడ్, సత్య రఘుపాల్, లక్ష్మి, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.