Share News

రైతు భవిష్యత్‌, ఆర్థిక వనరు ఆయిల్‌పామ్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:40 PM

రైతుల భవిష్యత్‌, ఆర్థిక వనరు ఆయిల్‌పామ్‌ పంట సాగు అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్‌బాషా అన్నారు.

రైతు భవిష్యత్‌, ఆర్థిక వనరు ఆయిల్‌పామ్‌
అయిజ రైతువేదికలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్‌బాషా

  • రైతులకు అవగాహన కల్పించిన జిల్లా ఉద్యావన శాఖ అధికారి అక్బర్‌బాషా

అయిజ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతుల భవిష్యత్‌, ఆర్థిక వనరు ఆయిల్‌పామ్‌ పంట సాగు అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్‌బాషా అన్నారు. మంగళవారం అయిజలో ని రైతువేదికలో జిల్లా సహకార శాఖ, అయిజ సింగిల్‌విండో అధ్యక్షుడు పోతు మధుసూదన్‌రె డ్డి ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చే శారు. ఈ కార్యక్రమానికి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు ఏ పంట సాగు చేసిన పెట్టుబడి భారం అధిరం అవుతుందని, ఆయిల్‌పామ్‌ సాగుతో తక్కువ పెట్టుబడితో ఎ క్కువ ఆదాయం పొందవచ్చిని సూచించారు. పంట సాగు గుదిబండగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ పె ట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయాలు సముకూర్చే పంటల ప్రోత్సాహంపై దృష్టి సాయించిందని పేర్కొన్నారు. ఈ పంట సాగుతో క్రిమిసంహారక మందుల వాడకం తగ్గటమే కాకుండా వాతావరణ, భూ కాలుష్యం కాకుండా ఉంటుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ మా ట్లాడుతూ ఆయిల్‌పామ్‌ పంట సాగుకై ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. సహకార సంఘాల ద్వారానే రైతుల సమీకరణ, కార్యాచరణ ఉంటుందనే, ఆ దిశగా రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ శివనాగిరెడ్డి, హార్టికల్చర్‌ అధికారులు మహేశ్‌, రాజశేఖర్‌, మండల వ్యవసాయాధికారి జనార్దన్‌, ఫీల్డ్‌ అధికారులు అశోక్‌ రెడ్డి, మంజునాథ్‌రెడ్డి, మేఘారెడ్డి, శివకుమార్‌, శశిధర్‌, సింగిల్‌విండో కార్యదర్శి మల్లేశ్‌, సిబ్బం ది జీవన్‌, శ్రీనివాస్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:40 PM