Share News

భూ సమస్యలపై గ్రామాలకు అధికారులు

ABN , Publish Date - May 05 , 2025 | 11:08 PM

భూభారతి చట్టం అమలు ద్వారా పెండింగ్‌లో ఉన్న భూ స మస్యలను అధికారులు పరిష్కరిస్తారని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

భూ సమస్యలపై గ్రామాలకు అధికారులు

- ఉదయం 9నుంచి 4గంటల వరకు అర్జీల స్వీకరణ

- గోపల్‌దిన్నె భూ భారతి అవగాహన సదస్సులో గద్వాల జిల్లా కలెక్టర్‌ సంతోష్‌

ఇటిక్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం అమలు ద్వారా పెండింగ్‌లో ఉన్న భూ స మస్యలను అధికారులు పరిష్కరిస్తారని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. సోమవారం మండలం లోని గోపల్‌దిన్నె గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులో రైతులు, ప్రజల నుంచి కలెక్టర్‌ అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమ లులో భాగంగా 28జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నార ని, మనజిల్లా నుంచి ఇటిక్యాల మండలాన్ని ఎం పిక చేసినట్లు తెలిపారు. గతంలో ప్రజలు తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే తమ గ్రామానికి వచ్చి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారని, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం విచారణ చేపట్టి అర్హులైన రైతులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఉదయం 9నుంచి 4గంటల వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, దరఖాస్తు ఫారంను అధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ వీరభద్రప్ప, ఎర్రవల్లి తహసీల్దార్‌ నరేశ్‌, ఎంపీడీవో అజహర్‌మొయినుద్దీన్‌, ఏవో రవికుమార్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:08 PM