అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:18 PM
పోలీస్ అధికారులు అప్రమత్తం గా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయని జోగు ళాంబ జిల్లా జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నా రు.
- డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
- ఆత్మకూరు, మదనాపురం పోలీస్ స్టేషన్‌ల తనిఖీ
ఆత్మకూరు/మదనాపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అధికారులు అప్రమత్తం గా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయని జోగు ళాంబ జిల్లా జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నా రు. వార్షిక తనిఖీలలో భాగంగా ఆత్మకూరు సీఐ కార్యాలయం మదనాపూర్ పోలీస్ స్టేషన్ కార్యా లయాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా డీఎస్పీ వెంకటేశ్వరరా వు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఎస్‌ఐ శేఖర్ రెడ్డిలు పుష్ఫగుచ్చం అందజేసి స్వాగతం పలికా రు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అ నంతరం పోలీసు కార్యాలయంలో మొక్కను నా టారు. ఆత్మకూరు, మదనాపూర్ స్టేషన్‌ల పరిధి లోని లాకప్ రూమ్, సెంట్రీ రిలీఫ్ బుక్, రైటర్, పార్కింగ్ ప్రదేశాలు వంటి వాటిని ప రిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తే నేరాలు అ దుపులో ఉంటాయని పోలీసులు గు ర్తించాలన్నారు. అలాగే మండలాల్లోని గ్రామాలకు కేటాయించిన పోలీసులు రోజు వారీగా గ్రామాలలో పర్యటించి గ్రామ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటేనే గ్రామ ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయన్నారు. 100 డయల్ రాగానే సంఘట న స్థలానికి చేరుకుని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలి పారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో డీజే సౌండ్ రద్దు కొరకు పోలీసు వారు ముమ్మరంగా ప్రచా రాలు నిర్వహించిన కారణంగానే డీజే సౌండ్లను విరమించుకొని భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్ర మాలు చేపట్టడం గర్వించదగ్గ విషయం అన్నా రు. అలాగే పేకాట, డ్రగ్స్, పీడీఎస్ రైస్, అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై దృష్టి సారించి వాటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అక్రమంగా ఇసుక, పీడీఎస్ రైస్‌ను అక్రమంగా రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయా లని ఆదేశించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది పాల్గొన్నారు.