అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:11 PM
వర్షాకాలంలో ఎదుర య్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీసీ నిర్వహించారు.
- ఈ నెల 16, 17వ తేదీలలో భారీ వర్షాలు
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ఎదుర య్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేకున్నప్పటికిని రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు న ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల వల్ల ఆస్థి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న గృహా లు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. 16,17వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీసీలో ఎ స్పీ శ్రీనివాసరావుతో, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ రహీముద్దీన్ వివి ధ శాఖల అధికారులు ఉన్నారు.