Share News

మైలారం గుట్టను పరిశీలించిన అధికారులు

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:26 PM

కొన్ని నెల లుగా మైలారం గ్రామానికి సమీపంలో ఉన్న గుట్ట పై మైనింగ్‌ పనులను వ్యతిరేకిస్తున్నారు.

మైలారం గుట్టను పరిశీలించిన అధికారులు
అదనపు కలెక్టర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న మైలారం గ్రామస్థులు

- తిరుగు ప్రయాణంలో అదనపు కలెక్టర్‌ వాహనాన్ని అడ్డుకోబోయిన గ్రామస్థులు

బల్మూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : కొన్ని నెల లుగా మైలారం గ్రామానికి సమీపంలో ఉన్న గుట్ట పై మైనింగ్‌ పనులను వ్యతిరేకిస్తున్నారు. గురువా రం నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ పొల్యూషన్‌ బోర్డు సభ్యులతో కలిసి గుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో గుట్ట సమీ పంలో ఉన్న శివాలయం వద్ద అదనపు కలెక్టర్‌ మాట్లాడుతారని మైలారం గ్రామస్థులు ఎదురు చూ శారు. ఆయన వాహనాన్ని నిలుపకుండా వెళ్తుంటే అడ్డుకోబోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహ రించి గ్రామస్థులను అడ్డుతొలగించారు. దీంతో అద నపు కలెక్టర్‌ వెళ్లిపోయారు. ఆగ్రహించిన గ్రామస్థు లు మైనింగ్‌ కాంట్రాక్టర్‌కు పోలీసులు రక్షణ కల్పి స్తున్నారని ఆరోపించారు. పనులను నిలిపివేసే వర కు పోరాటం కొనసాగిస్తామని మైనింగ్‌ వ్యతిరేక పోరాట కమిటీ గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో పొల్యూషన్‌ బోర్డు సభ్యులు సురేంద్రబాబు, నాగేంద్రం, చైతన్యం, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, అచ్చంపేట సీఐ రవీందర్‌ ఉన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:26 PM