తప్పుడు రిపోర్టుపై డయాగ్నొస్టిక్ సెంటర్‌కు నోటీసు
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:57 PM
జిల్లాకేంద్రంలోని క్రాంతి డయాగ్నొస్టిక్ సెంటర్‌కు బుధవారం నోటీసులు జారీ చేసినట్లు డీఎం హెచ్‌వో సిద్ధప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి.
గద్వాల క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రంలోని క్రాంతి డయాగ్నొస్టిక్ సెంటర్‌కు బుధవారం నోటీసులు జారీ చేసినట్లు డీఎం హెచ్‌వో సిద్ధప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి. అయిజ పట్టణంలోని జోగుళాంబ సెంట్రల్ ల్యాబ్‌కు ఈ నెల 11న ఓ గర్భిణి పురుటి నొప్పు లతో వెళ్లింది. అమెను పరిక్షించిన వైద్యులు ఉ మ్మనీరు తక్కువ(3.4 సెంటీమీటర్లు)గా ఉందని తెలిపారు. కాన్పు చేయడం కష్టమని, జిల్లా ప్ర భుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ రిపోర్టుపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో జి ల్లా కేంద్రంలోని క్రాంతి డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడి రిపోర్టులో 11, 12 సెంటీమీటర్ల మధ్యన ఉమ్మనీరు ఉందని చెప్పారు. ఈ విషయంపై వివిధ సంఘాల నా యకులు డీఎంహెచ్‌వో, కలెక్టర్లకు ఫిర్యాదు చేశా రు. దీని ఆధారంగా ఈ నెల 14న గర్భిణికి జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి రి పోర్టు ఇచ్చారు. ఇది అయిజలోని జోగుళాంబ సెంట్రల్ ల్యాబ్ రిపోర్టుకు సరిపోలింది. ఉమ్మ నీరు తక్కువగానే ఉందని స్పష్టం కావడంతో జి ల్లా ఆసుపత్రి వైద్యులు సూపరింటెండెంట్ ఆధ్వ ర్యంలో ఆమెకు కాన్పు చేశారు. తల్లి, బిడ్డ క్షేమం గా ఉన్నారు. క్రాంతి డయాగ్నొస్టిక్ సెంటర్ ఇచ్చి న తప్పుడు నివేదికను నమ్మి, కాన్పు ఆలస్యం చేసి ఉంటే శిశువు ప్రాణాలకు ప్రమాదం సంభవించేది. ఈ మేరకు తప్పుడు రిపోర్టు ఇచ్చి న క్రాంతి డయాగ్నొస్టిక్ సెంటర్‌కు నోటీసు జారీ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.