ఉత్తీర్ణత కాదు.. ఉత్తమ మార్కులు రావాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:05 PM
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు ఎలాగైన సాధిస్తారని, కానీ ప్రతీ ఒక్కరు 500 పైగా మార్కులు సాధించేలా సిద్ధం కావాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు.
- ప్రణాళికతో చదువుకుంటేనే సాధ్యం
- శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్
ఊట్కూర్, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు ఎలాగైన సాధిస్తారని, కానీ ప్రతీ ఒక్కరు 500 పైగా మార్కులు సాధించేలా సిద్ధం కావాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. మంగ ళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో వేర్వేరుగా తరగతుల్లో కలిసి మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. మంచి మార్కులు సాధించడానికి ప్రణాళిక బద్ధంగా చదువుకుంటే, అనుకున్న లక్ష్యం సుల భం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు అంగ న్‌వాడీలో రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్ సీని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. అప్ర మత్తంగా ఉండి పని చేయాలని వైద్య సిబ్బందిని సూచించారు. ఎంపీడీవో ధనుంజయ్ గౌడ్, ఎంఈవో మాధవి, ఎంపీవో ఎంఎల్‌ఎన్ రాజు, కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మి పలువురు పాల్గొన్నారు.