పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:28 PM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
- ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
మూసాపేట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అడ్డాకుల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసి, మాట్లాడారు. గత ప్రభుత్వం మోసపూరితమైన హామీలు, కళ్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించిందని, పథకాల పేరిట ఇష్టానుసారంగా రాష్ర్టాన్ని అప్పుల బారిన పడేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే విడతల వారిగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో ప్రస్తుతం 47 ఇళ్లను ఇచ్చామని, ఇదే అడ్డాకుల మండల కేంద్రంలో బీఆర్‌యస్ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజూరి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, మాజీ ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి గంగుల విజయమోహన్‌రెడ్డి, బి.దశరథరెడ్డి, షఫీఅహ్మద్, శేఖర్‌రెడ్డి, ఆజం, వేగనాథ్, రాములు పాల్గొన్నారు.
గండీడ్ : ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడం జరుగుతోందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సల్కర్‌పేట్‌లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు భూమి పూజ చేసి, మాట్లాడారు. పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మినారాయణ, మాజీ సర్పంచు ఉశన్న, బసప్ప పాల్గొన్నారు.