Share News

చివరి ఆయకట్టుకు చుక్కనీరు రాలే

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:35 PM

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) కింద క్రమంగా పెరుగుతున్న ఆయకట్టుకు నీరందిం చే క్రమంలో సాగునీటి శాఖకు అనేక అవాంత రాలు ఎదురవుతున్నాయి.

చివరి ఆయకట్టుకు చుక్కనీరు రాలే
వట్టెం రిజర్వాయర్‌

- మాడ్గుల మండలం నాగిళ్ల వరకు పూర్తి కాని భూసేకరణ

- తరచూ తెగిపోతున్న డీ-82 కాలువ

- చివరి ఆయకట్టు వరకు సాగునీరివ్వాలంటే పీఆర్‌ఎల్‌ లింక్‌ కెనాల్‌పైనే ఆశలు

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) కింద క్రమంగా పెరుగుతున్న ఆయకట్టుకు నీరందిం చే క్రమంలో సాగునీటి శాఖకు అనేక అవాంత రాలు ఎదురవుతున్నాయి. కేఎల్‌ఐ హెడ్‌వర్క్స్‌ లో రెండు మోటార్లు మరమ్మతుకు నోచుకోకపో వడం, కాల్వల సామర్థ్యం పెరిగినా ఆయకట్టు కనుగుణంగా పెంచకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. కేఎల్‌ఐ కింద ఎల్లూరు, సింగ వట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వా యర్లు మినహాయించి చెరువులు, కుంటల్లో నీళ్లు నింపడం తప్ప అదనంగా నిర్మించాల్సిన 17 రిజర్వాయర్ల ఊసే ఎత్తలేదు. దీంతో కేఎల్‌ ఐపై ఆశలు పెట్టుకున్న చివరి ఆయకట్టు రైతు ల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

చివరి ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి..

కేఎల్‌ఐ కింద 2.45లక్షల ఎకరాల మెట్ట పం టలకు సాగునీరందించాలనే లక్ష్యంతో పనుల ను ప్రారంభించారు. ఈ క్రమంలో రైతుల నుం చి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆయకట్టు పరి మాణం పెరుగుతూ దాదాపు 4.45లక్షల ఎకరా లకు చేరింది. 2.45లక్షల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో కేఎల్‌ఐ డిజైన్‌ రూపొందించారు. గుడిపల్లి గట్టు నుంచి 160 కిలోమీటర్ల వరకు మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సాగునీరందించాల్సిన మెయిన్‌ కెనాల్‌లో అసలు ఆయకట్టు 1.80లక్షల ఎకరాలు కాగా.. డీ-82 వరకు అదనంగా 37,742ఎకరాలకు పెం చారు. బుద్దారం కెనాల్‌ ఆయకట్టు విస్తీర్ణాన్ని 20,724 ఎకరాలకు పెంచగా కేఎల్‌ఐ మెయిన్‌ కెనాల్‌లో 37వ కిలో మీటరు వద్ద ఘణపూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పేరిట మరో 25వేల ఎకరాల ఆయకట్టును జోడించారు. కర్నెతండాలో 4,400 ఎకరాలు, మార్కండేయ రిజర్వాయర్‌ పేరిట 7,310 ఎకరాల్లో కేఎల్‌ఐ ఆయకట్టు కింద విస్తీ ర్ణాన్ని రైతుల డిమాండ్‌ దృష్ట్యా పెంచాల్సి వ చ్చింది. కల్వకుర్తి కెనాల్‌ కింద రంగారెడ్డి జిల్లా లోని మాడ్గుల, ఆమనగల్‌ మండలాల్లో దాదా పు 21వేల ఎకరాలకు కృష్ణా జలాలతో మెట ్టభూములను తడపాల్సి ఉండగా కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి తలెత్తింది. డీ-82 కెనాల్‌ తరచూ తెగిపోతుండ డంతో చివరి ఆయకట్టుకు చుక్క నీరందించలే ని పరిస్థితి తలెత్తింది. అచ్చంపేట బ్రాంచ్‌ కెనా ల్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. 90వేల ఎకరా ల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉం డగా 15వేల ఎకరాల ఆయకట్టును పెంచడంతో క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

లింక్‌ కెనాల్‌తోనే సమస్యకు పరిష్కారం

సుదీర్ఘకాలం పాటు సాగునీటి సమస్యలను ఎదుర్కొన్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రతీ గ్రా మానికి కృష్ణా జలాలు అందాలనే డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాలు కూ డా ప్రతీ గుంటకు సాగునీరందిస్తామని రైతుల ను నమ్మించారు. మున్ముందు వచ్చే డిమాండ్ల కు అనుగుణంగా కేఎల్‌ఐ రూపొందించకపో వడం కారణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌)పై రైతులు అ నేక ఆశలు పెట్టుకున్నారు. సమస్యలను పరిగ ణనలోకి తీసుకోకపోవడంతో పీఆర్‌ఎల్‌ఐఎస్‌ ద్వారా లింక్‌ కెనాల్‌ ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో రూ.15కోట్ల వ్యయంతో లింక్‌ కెనాల్‌ కేఎల్‌ఐకి అనుసంధానం చేసేందుకు వట్టెం రిజర్వాయర్‌ మీదుగా కేఎల్‌ఐ అదనపు ఆయ కట్టుకు లింక్‌ కెనాల్‌ను నిర్మించేందుకు ప్రభు త్వానికి ప్రతిపా దనలు పంపించారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచా రం. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను తెప్పించుకున్న అధికారు లు త్వరలోనే అనుమతులు వస్తాయనే ఆశావా హ దృక్పథంతో ఉన్నారు. వట్టెం రిజర్వాయర్‌ లోని 10.100 కిలో మీటర్ల నుంచి 15.23కిలో మీటర్ల వరకు లింక్‌ కెనాల్‌ నిర్మాణం చేపడితే తద్వారా మాడ్గుల మండలం నాగిళ్ల వరకు దాదాపు 1.50లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రక్రియ సులభతర మవుతుందని ప్రతిపాదించి నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మౌఖికంగా ఇరిగేషన్‌ అధికారులకు అనుమతు లు లభించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే విషయాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయాలని నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.

Updated Date - Sep 22 , 2025 | 11:35 PM