Share News

నేటితో నామినేషన్లకు తెర

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:27 PM

సర్పంచ్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ల ఘట్టం శుక్రవారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్లలో భాగంగా రెండో రోజు గురువారం ఊపందుకున్నాయి.

నేటితో నామినేషన్లకు తెర

రెండో రోజు ఊపందుకున్న మూడోవిడత..

సర్పంచ్‌కు 254.. వార్డు సభ్యులకు 928 దాఖలు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ల ఘట్టం శుక్రవారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్లలో భాగంగా రెండో రోజు గురువారం ఊపందుకున్నాయి. జిల్లాలోని 5 మండలాల్లో సర్పంచ్‌లకు 254, వార్డు సభ్యులకు 928 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి సర్పంచ్‌లకు 335, వార్డు సభ్యులకు 1102 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల, బాలానగర్‌లో బాగానే వచ్చాయి. రెండో విడత నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, ఏకగ్రీవాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 11:27 PM