Share News

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:17 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించను న్నారు.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • మొదటి విడతలో గద్వాల, ధరూరు, కేటీదొడ్డి

  • మొత్తం 20 కేంద్రాల్లో స్వీకరణకు ఏర్పాట్లు

గద్వాల, ధరూర్‌, కేటీదొడ్డి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించను న్నారు. దీనికోసం మొదటి విడతలో జిల్లాలోని మూడు మండలాల్లో మొత్తం 20 కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఆయా గ్రామాలకు కేటాయిం చిన కేంద్రాల్లో సర్పంచు, వార్డు మెంబర్ల స్థా నాలకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేష న్లను స్వీకరించనున్నారు. గద్వాల మండలంలో ఆరు నామినేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో డా.శైలజ తెలిపారు. అలాగే ధరూర్‌ మం డలం లో ఏడు నామినేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలంలో ఏడు నామినేషన్‌ సెంట ర్‌లను ఏర్పాటు చేశామని ఎంపీడీవో రమణ రావు తెలిపారు.

Updated Date - Nov 26 , 2025 | 11:17 PM