పరిహారం పెంపును ఆమోదించాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:41 PM
మహబూబ్‌నగర్ జిల్లా జ డ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వా సితుల పునరావాస ప్యాకేజీ పెంపునకు సంబంధించిన అంశాన్ని కేబి నెట్‌లో ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు.
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విజ్ఞప్తి
జడ్చర్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా జ డ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వా సితుల పునరావాస ప్యాకేజీ పెంపునకు సంబంధించిన అంశాన్ని కేబి నెట్‌లో ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు. రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు లు వేంనరేందర్‌రెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్య మంత్రి కార్యాలయంలో సీఎంను కలిశారు. పాలమూరు-రంగారెడ్డి ఎ త్తిపోతల పథకంలో పరిహారం పెంపునకు సంబంధించిన ఫైల్ ఆ మోదం కోసం ప్రస్తుతం ఆర్థికశాఖ వద్దకు చేరిందని, అనంతరం కేబి నెట్‌లో పెట్టి ఆమోదించాలని కోరారు. ఇందిరమ్మ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను తొలగించి, బిల్లులు సత్వరమే క్లియర్ చేసేవిఽ దంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాదులు వేసుకున్నారని, యాప్‌లో అ ప్‌లోడ్ కాకపోవడంతో బిల్లులు ఆగిపోయాయని వివరించారు. రాజా పూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్‌ముఖ్ పేరుతో ఉన్న భూములను రైతుల పేరుపై మార్చేందుకు ఇప్పటికే కలెక్టర్‌కు ప్రతిపాదనలను పంపామని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ రెవె న్యూశాఖ మంతిని కోరారు. ఆ భూములను రైతులకు అందేలా చర్య లు తీసుకోవాలని కోరారు.