బలవంతపు భూసేకరణ వద్దు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:38 PM
బలవంతపు భూసేకరణ చేయొద్దంటూ నా గర్‌కర్నూల్ జిల్లా బల్మూరు తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు ది గారు.
- తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల బైఠాయింపు
బల్మూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): బలవంతపు భూసేకరణ చేయొద్దంటూ నా గర్‌కర్నూల్ జిల్లా బల్మూరు తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. భూసేకరణ చేస్తామంటూ మంగళ వారం ఉదయం రైతులకు తహసీల్దార్ కా ర్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో బుధవారం ఉదయం అనంతవరం, మైలా రం, అంబగిరి, బల్మూరు గ్రామాల రైతులు మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉమామహేశ్వర రిజ ర్వాయర్‌ను ఈ ప్రాంతంలో నిర్మించవద్దని మా భూములు పోతే మేము దిక్కులేని వా రమవుతామని వారు ఆవేదన వ్యక్తం చేశా రు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, అధి కారులు రైతులతో మాట్లాడకుండా, ప్రజా సేకరణ చేయకుండానే ఇలా భూమిని సర్వే చేస్తామని ఫోన్లు చేయడం ఏమిటని ప్ర శ్నించారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీ ల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతులు కార్యా లయం ముందు బైఠాయించారు. అనంత రం తహసీల్దార్ శ్రీకాంత్‌కు పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సీతారాంరెడ్డి మాట్లాడుతూ రైతు ల అభిప్రాయం లేకుండా ఈ ప్రాంతంలో రి జర్వాయర్ నిర్మాణం చేసి వారి ఉసురు తీ సుకోవద్దన్నారు. కేవలం కొందరు లబ్ధి పొం దడానికి మాత్రమే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మమ్మల్ని సంప్రదించకుండా ఎవరైనా అధికారులు భూమి మీదకి వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరించారు. రైతులు ఇంద్రారెడ్డి, నాగ య్య, మల్లేష్, రాజు, బాలస్వామి, బక్కయ్య, రాములు, నరసింహ పాల్గొన్నారు.