Share News

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:43 PM

గద్వాలలోని మూడు పరీక్ష కేంద్రాలలో ఆదివా రం నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) 2025-26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

గద్వాల సర్కిల్‌, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): గద్వాలలోని మూడు పరీక్ష కేంద్రాలలో ఆదివా రం నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) 2025-26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో 97.39 శాతం విద్యార్థులు హాజరైనట్టు డీఈవో విజయలక్ష్మి, జిల్లా పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. మూడు పరీక్ష కేం ద్రాలలో 728 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 19 మంది పరీక్షకు హాజరు కాలేదు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 243 విద్యార్థులకు గాను 238 (97.94 శా తం) మంది విద్యార్థులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 243 మంది విద్యార్థులకు గాను 234 (96.29 శాతం) మంది, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో 242 మంది వి ద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 237 (97.93 శాతం) మంది విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరీక్షల అసిస్టెం ట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లను ఆయా చీఫ్‌ సూపరింటెండెంట్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:43 PM