పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్య
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:32 PM
పెళ్లయిన మూడు రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకొంది.
కోస్గి రూరల్, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి): పెళ్లయిన మూడు రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకొంది. కుటుంబీకు లు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రా మానికి చెందిన గొల్ల శ్రీలతకు ఫారూఖ్‌న గర్ మండలం భీమవరం గ్రామానికి చెం దిన వ్యక్తితో పెళ్లి జరిగింది. నవ దంపతులు వికారాబాద్ జిల్లా దోమ మండలం మో త్కూరులో ఉంటున్న మేనమామ ఇంటికి వ చ్చారు. ఈ నెల 28న పురుగుల మందు తా గడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవే టు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందిం చారు. చికిత్స పొందుతూ ఈ నెల 29న గొ ల్ల శ్రీలత(21) మరణించింది. కాగా చంద్ర వంచకు చెందిన ఓ యువకుని వేధింపులకే తమ చెల్లి పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకుందని మృతురాలి సోదరులు గొల్ల మహేష్, గొల్ల శ్రీశైలం ఆరోపిస్తున్నా రు. బ లవంతపు పెళ్లి చేయడంతోనే మరణిం చినట్లు మరి కొందరు అం టున్నారు. పూ ర్తి వివరాలు తె లియాల్సి ఉం ది. బాధిత కు టుంబానికి న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ కోస్గి శివా రు చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోలీసు లు వచ్చి వారిని సద్దుమణిగించారు.