Share News

నవ వధువు ఆత్మహత్య

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:45 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం రాళ్లగడ్డతండాలో నవవధువు చర్చిత(20) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండావాసులు, విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం..

నవ వధువు ఆత్మహత్య

జడ్చర్ల, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం రాళ్లగడ్డతండాలో నవవధువు చర్చిత(20) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండావాసులు, విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందిన చర్చిత, జడ్చర్ల మండలం రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్‌ యాదాద్రి జిల్లాలోని రాయగిరి ప్రాంతంలో బీ ఫార్మసీ కళాశాలలో కలిసి చుదువుకున్నారు. వీరు ప్రేమించుకున్నారు. గత నెలలో వివాహం చేసుకున్నారు. వివాహానికి చర్చిత తల్లిదండ్రులు, బంధువులు రాలేదని తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చర్చిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన పవన్‌ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 10:45 PM