క్రీడాభివృద్ధికే నూతన క్రీడాపాలసీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:09 PM
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి నూతన క్రీడా పాలసీ తీసుకురావడం హర్ణణీయమని పీడీ అండ్ పీఈటీల అసోసయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్ అన్నారు.
జడ్చర్ల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి నూతన క్రీడా పాలసీ తీసుకురావడం హర్ణణీయమని పీడీ అండ్ పీఈటీల అసోసయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్ అన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీ హరిజనవాడ జడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం వ్యాయామ విద్య ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలతో క్రీడలకు మహర్దశ రానుందని, కాలానుగుణంగా మారుతున్న క్రీడా నైపుణ్యాలు, నియమ నిబంధనలు, శిక్షణలో మార్పులు తదితర అంశాలు కూశంకలంగా చర్చించుకోవడానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడుతాయన్నారు. ఒలంపిక్స్‌లో సత్తా చాటేందుకు సౌత్ కొరియాతో ఒప్పందం చేసుకుని ఉత్తమ శిక్షణను అందించే విధంగా వివిధ క్రీడాంశాలలో నైపుణ్యం పెంచడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కృష్ణయ్య, శారదాబాయి, వడ్డెన్న, కిట్టు, మోయిన్ పాల్గొన్నారు.