Share News

కొత్త రోడ్డు కోత

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:15 PM

నగరంలోని బాయమ్మతోట వ ద్ద ఇటీవల వేసిన రోడ్డు కోతకు గురైంది.

కొత్త రోడ్డు కోత
కోతకు గురైన సీసీరోడ్డు

మహబూబ్‌నగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బాయమ్మతోట వ ద్ద ఇటీవల వేసిన రోడ్డు కోతకు గురైంది. గాం డ్లోనికుంట నుంచి వచ్చే వరద నీటిని బాయ మ్మతోట నాలా ద్వారా పెద్దచెరువులోకి మళ్లి స్తారు. అయితే 20 అడుగలు మేర ఉంటే ఈ నాలా కబ్జాలకు గురవుతూ వచ్చింది. ప్రస్తు తం 5-6 అడుగులు మాత్రమే మిగిలింది. ఇటీ వల ఈ నాలా పక్కనే ఇటీవలే సీసీ రోడ్డును వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలను నా లానుంచి పెద్దఎత్తున వరద ప్రవహించింది. నాలా కుచించుకుపోవడంతో నీటి ప్రవాహ నం ఎక్కువగా ఉండటంతో పక్కనే వేసిన సీ సీ రహదారి కోతకు గురై కొట్టుకుపోయింది. మళ్లీ అధిక వర్షాలు కురిస్తే తమ ఇళ్లలోకి నీ రు చేరుతుందని స్థానికులు ఆందోళన చెం దుతున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:15 PM