Share News

ఎస్పీని కలిసిన ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గం

ABN , Publish Date - May 08 , 2025 | 11:10 PM

ఇటీవల నిర్వహించిన ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండిపెండెంట్‌ ప్యానల్‌ అఽభ్యర్థులు గురువారం ఎస్పీ జానకిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎస్పీని కలిసిన ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గం
ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గంతో మాట్లాడుతున్న ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల నిర్వహించిన ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండిపెండెంట్‌ ప్యానల్‌ అఽభ్యర్థులు గురువారం ఎస్పీ జానకిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్‌చారి, నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎస్పీ అభినందించారు. ప్రెస్‌క్లబ్‌కు పోలీస్‌శాఖ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. మీడియాలో అనవసరమైన వార్తలు, వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా, ప్రజలను రెచ్చగొట్టేలా, సున్నిత అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి యాదయ్య, ఉపాధ్యక్షుడు చింతకాయల వెంకటేశ్‌, అక్కల ధరణికాంత్‌, సంయుక్త కార్యదర్శులు సతీష్‌కుమార్‌, మణిప్రసాద్‌, కృష్ణ, కార్యవర్గ సభ్యులు రవికుమార్‌, మోహన్‌దాస్‌, రమణ, రాంకొండ, శాబుద్దీన్‌, అహద్‌సిద్దికి, సీనియర్‌ జర్నలిస్టులు బస్వరాజు, కిశోర్‌కుమార్‌, వెంకటేశ్వర్‌రావు, మధుసూదన్‌రావు, రవికుమార్‌, శివకుమార్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

పోలీసులకు సెలవులు రద్దు

దేశ సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్యా పోలీస్‌శాఖ జిల్లాలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ జానకి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసులకు సెలవులు రద్దు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు అనుచిత పోస్టులు పెట్టవద్దని, తప్పుడు సమాచారం ప్రసారం చేయకూడదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయడం నిషేధం అన్నారు. సోషల్‌మీడియాపై పటిష్ఠ నిఘా కొనసాగుతుందని, అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని, గుర్తింపు లేని వారికి లాడ్జిలో వసతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 08 , 2025 | 11:10 PM