రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:29 PM
వివిధ సందర్భాల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దహనం చేశారు.
మహ బూబ్‌నగర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వివిధ సందర్భాల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దహనం చేశారు. ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి నేతృత్వంలో, డ్రగ్ డిస్పోజల్ కమిటీ సూచనలు, జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 3.5 కిలోల ఎండు గంజాయి, 13.5 కిలోల అల్ర్పాజోలం, 5.8 కిలోల డైజోఫాంలను షాద్‌నగర్ దగ్గరున్న జె మల్టీ క్లేవ్ బాయిలర్ కంపెనీలో కాల్చి బూడిద చేశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి నరసింహ్మారెడ్డి పాల్గొన్నారు.