నారాయణపేట ఎంవో ఉమాకాంత్, ప్రత్యూష
ABN , Publish Date - May 06 , 2025 | 11:10 PM
మాగనూరు మండల కేంద్రంలోని పోస్టుమన్ ధనుంజయ అవినీతి ఆరోపణలపై విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ప్రధాన పోస్టాఫీస్ ఎంవో ఉమాకాంత్, ప్రత్యూష చెప్పారు.
ఖాతాదారుల డబ్బులు వాడుకున్న మాగనూరు పోస్టుమన్‌పై ఎంక్వైరీ
మాగనూరు, మే 6(ఆంధ్రజ్యోతి): మాగనూరు మండల కేంద్రంలోని పోస్టుమన్ ధనుంజయ అవినీతి ఆరోపణలపై విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ప్రధాన పోస్టాఫీస్ ఎంవో ఉమాకాంత్, ప్రత్యూష చెప్పారు. వివిధ పథకాల్లో లబ్ధిదారులు జమ చేసుకునేందుకు ఇచ్చిన డబ్బులను పోస్ట్‌మన్ ధనుంజయ వారి ఖాతాల్లో వేయకుండా వాడుకోవడం, ఖాతాదారుల పాస్ పుస్తకాలను తన వద్దే ఉంచుకోవడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఎంవో ఉమాకాంత్ మాట్లాడుతూ మాగనూరు పోస్టు ఆఫీ్‌సలో డబ్బులు జమ చేసిన అకౌంట్ హోల్డర్లను విచారించగా, 57 మంది డబ్బులను పాసు బుక్కుల్లో ఎంట్రీ చేయకుండా, పోస్టుమన్ ధనుంజయ వాడుకున్నట్లు తెలిసిందన్నారు. అతన్ని నాలుగు నెలల క్రితమే సస్పెండ్ చేశామన్నారు. ఖాతాదారుల ఆధార్‌కార్డు, పోస్టాఫీ్‌సలో లభించిన పాసు పుస్తకాల అమౌంట్ ప్రకారం అకౌంట్‌దారులకు డబ్బుల వివరాల రశీదులు ఇచ్చామన్నారు. మళ్లీ వారంలోపు ధనుంజయుడిని తీసుకువచ్చి ఖాతాదారుల సమక్షంలో విచారణ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ వివిధ పథకాల్లో జమ చేసిన డబ్బులు రూ.ఆరు లక్షలపైగా ఉంటాయని చెప్పారు. తమ డబ్బులు తమకు ఇప్పించి, న్యాయం చేయాలని వాకిటి శ్రీనివాసులు, ఆరీఫ్, ముష్టి వెంకటయ్య కోరారు.