నడిగడ్డ క్రీడలకు పుట్టినిల్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:32 PM
నడిగడ్డ క్రీడాకారులకు పుట్టినిల్లులాంటిదని, ఇక్కడి క్రీడా కారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని డీఈవో విజయలక్ష్మి అన్నారు.
ఎస్‌జీఫ్ పోటీలను ప్రారంభించిన డీఈవో
అలంపూర్ అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): నడిగడ్డ క్రీడాకారులకు పుట్టినిల్లులాంటిదని, ఇక్కడి క్రీడా కారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని డీఈవో విజయలక్ష్మి అన్నారు. గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండ లంలోని లింగనవాయి జడ్పీహెచ్‌ఎస్ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి 69వ ఎస్‌జీఎఫ్ అండర్ 14 వాలీబాల్ బాల, బాలికల పోటీలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, ప్రతీ ఒక్కరు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. వాలీబాల్ క్రీడల్లో 13 మండలాల నుంచి పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీలలో బాలురు విభా గంలో విన్నర్‌గా గద్వాల జట్టు, రన్నర్‌గా కేటీ దొడ్డి, బాలికల విభాగంలో విన్నర్‌గా ఎర్రవల్లి, రన్నర్‌గా గద్వాల జట్లు నిలిచాయి. విజేతలకు కప్‌లు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో అశోక్ కుమార్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.