Share News

తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని..

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:27 PM

భార్య తాగేందుకు డబ్బులివ్వ లేదని రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూ బ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని పెద్దా యపల్లి శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది..

తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని..

బాలానగర్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): భార్య తాగేందుకు డబ్బులివ్వ లేదని రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూ బ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని పెద్దా యపల్లి శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది.. ఇందుకు సంబం ధించిన వివరాలు.. నవాబుపే ట మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెంది న గోవింద్‌ వెంకటయ్య (45) షాద్‌నగర్‌ పట్టణంలోని నాగులపల్లి చౌరస్తాలో టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకొని జీవిస్తున్నాడు. వెంకటయ్య తాగుడుకు బానిస అ య్యాడు. తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంలో కర్ణాటక సం పర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్‌ మాస్టర్‌ భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 11:27 PM