నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:16 PM
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలమూరులోనూ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థిగా ఉన్న తన ఫోన్ నెంబర్‌ను ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం ఆయన విచారణ కమిటీ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి
మహ బూబ్‌నగర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలమూరులోనూ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థిగా ఉన్న తన ఫోన్ నెంబర్‌ను ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం ఆయన విచారణ కమిటీ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గురువారం ఎస్పీ జానకికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో మాజీ కేంద్రమంత్రి దివంగత జైపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన విషయాలను ట్యాప్ చేశారన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, సిరాజ్‌ఖాద్రి, సీజే బెనహర్ పాల్గొన్నారు.