Share News

నా జీవితం ప్రజా సేవకే అంకితం

ABN , Publish Date - May 04 , 2025 | 10:44 PM

నా జీవితం ప్రజల సేవకే అంకి తమని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే.అరుణ అన్నారు.

నా జీవితం ప్రజా సేవకే అంకితం
ఎంపీ డీకే అరుణను గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

- జన్మదిన వేడుకల్లో ఎంపీ అరుణ

- పేటలో పెద్ద ఎత్తున రక్తదానం

నారాయణపేటటౌన్‌/ మరికల్‌/మక్తల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): నా జీవితం ప్రజల సేవకే అంకి తమని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే.అరుణ అన్నారు. ఆ దివారం నారాయణపేటలో ఎంపీ జన్మదినాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఎంపీ అరుణ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెను గజమాల, శాలువాలతో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, ఎస్‌.విజయ్‌కుమార్‌, లక్ష్మికాంత్‌రెడ్డి, గోవ ర్దన్‌గౌడ్‌, పున్నంచంద్‌ లాహోటి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా, మరికల్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో ఎంపీ అరుణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పట్టణంలో ఓ పెట్రోల్‌బంక్‌ ప్రారంభానికి వచ్చిన అరుణకు చిన్నారులు స్వాగతం పలకగా అనంతరం ఆమె వారికి నోట్‌బుక్స్‌, పలక, పెన్నులను అందించారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేశారు. బీజేపీ నాయకులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లక్మికాంతరెడ్డి, తిరుప రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నర్సిములు, పోలేమెని రమేష్‌, శెట్టి మహేందర్‌ తదితరులున్నారు.

మక్తల్‌ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ఎంపీ అరుణ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు బీజేపీ జిల్లా నాయకురాలు ప్రసన్న చీరలు పం పిణీ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్నిస్వామి, పట్టణ అధ్యక్షుడు బాయికాటి రాజశేఖ ర్‌రెడ్డి, జిల్లా నాయకులు నర్సింహారెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, బలరాంరెడ్డి, సత్యనారాయణ, రాంమాధవ్‌, జయానంద్‌, నర్సిములు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 10:44 PM