Share News

పాతకక్షల నేపథ్యంలో పరస్పర దాడులు

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:22 PM

హోలీ పండగ సందర్బంగా జిల్లా కేంద్రంలో తె లుగుపేటకు చెందిన ఓ యూత్‌నాయకులు జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై బీరు సీసాలతో దాడి చేసి హత్యాయత్నాని కి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చేటుచేసుకున్నది.

పాతకక్షల నేపథ్యంలో పరస్పర దాడులు

- దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలు

- హోలీ రోజే గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

గద్వాల క్రైం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ పండగ సందర్బంగా జిల్లా కేంద్రంలో తె లుగుపేటకు చెందిన ఓ యూత్‌నాయకులు జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై బీరు సీసాలతో దాడి చేసి హత్యాయత్నాని కి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చేటుచేసుకున్నది. కొన్నిరో జుల క్రితం ఇదే యూత్‌కు చెందిన కొందరు యువకులు మూడవ వార్డులోని ఓ వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన సంఘటన మరువ క ముందే మళ్లీ ఇలా బీరుసీసాలతో దాడి చేయడం జిల్లా కేంద్రంలో చర్చానీయంగా మారిం ది. ఇందుకు సంబంధించి స్ధానికులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నాగరాజు, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మన్‌లతో పాటు మరికొందరు హోలీ సందర్బంగా రంగులు చల్లుకొని మధ్యాహ్నం అందరూ స్నానం చేసేందుకు జిల్లా కేంద్రంలోని కృ ష్ణానదికి వెళ్లారు. అక్కడ స్నానం చేసుందుకు సిద్దం అవుతుండగా తెలుగు పేటకు చెందిన ఓ యూత్‌ నాయకుడి అనుచరులు దాదాపు 20 మంది దాకా అక్కడికి చేరుకున్నారు. అయితే ఒడ్డున కూర్చున వీరితో గొడవకు దిగారు. ఆ క్రమంలో మాటామాటా పెరిగి వారితో తెచ్చుకున్న మద్యం బాటిల్‌ను పగులకొట్టి వీరిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడే ఉన్న కొందరు స్ధానికులు అడ్డుపడటంతో ఆ యువకులు వీరిపై దుర్బాశలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తగాయలతో ఉన్న లక్ష్మన్‌, నాగరాజులతో పాటు మరికొంతమందిని స్ధానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. అయితే తెలుగు పేటకు చెందిన యూత్‌ నాయకుడి అనుచరులకు, వీరికి మధ్య పాత తగాదాలు ఉన్నట్లు జిల్లాకేంద్రంలో చర్చ జరుగుతుంది. తెలుగుపేటకు చెందిన యూత్‌నాయకుడి అను చరులు ఇలా అడ్డువచ్చిన వారిపై బీరుసీసాల తో దాడి చేసి హత్యాయత్నాలు చేసిన పోలీసు లు ఎందుకు కేసులు చేయడంలేదో అర్ధం కావడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి రాజీ చేస్తూ చేతు లు దులుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఇ లా జరిగిన సంఘటనపై కేసు చేసిఉంటే ఈ రోజు మళ్లీ ఇలా దాడి జరిగేది కాదని స్ధానికు లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు లు ఈ హత్యాయత్నంపై పూర్తిస్ధాయిలో విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ను వివరణ కోరగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:22 PM