Share News

రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:55 PM

రాష్ట్రస్థాయి కరాటే టోర్నీలో జి ల్లా విద్యార్థులు పతకాలు సాధించాలని ఎస్‌జీ ఎఫ్‌ సెక్రటరీ డా.శారదాబాయి అన్నారు.

రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలి
కరాటే విద్యార్థులతో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ శారదాబాయి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి కరాటే టోర్నీలో జి ల్లా విద్యార్థులు పతకాలు సాధించాలని ఎస్‌జీ ఎఫ్‌ సెక్రటరీ డా.శారదాబాయి అన్నారు. వరం గల్‌ జిల్లాలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వర కు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అం డర్‌-19 కరాటే టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలను ఆదివారం నగరంలోని ఇండోస్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చాటి జాతీ య స్థాయి పోటీలకు ఎంపిక కావాలన్నారు. పీడీ వేణుగోపాల్‌, కరాటే మాస్టర్లు కృష్ణయ్య, శంకర్‌నాయక్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 10:55 PM