సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:58 PM
నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ పోలీసులకు సూచించారు.
- జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
- నారాయణపేట, కోస్గి, మద్దూరులలో పర్యటన
నారాయణపేట/ కోస్గి/ మద్దూరు, సెప్టెం బరు 19 (ఆంధ్రజ్యోతి) : నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ పోలీసులకు సూచిం చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన నారాయణపేటలోని ఎస్పీ కార్యాల యం, కోస్గి సర్కిల్ ఆఫీస్, మద్దూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ముందుగా కోస్గి సర్కిల్ కార్యాలయంలో పోలీసుల గౌరవవంద నాన్ని స్వీకరించారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. రికార్డులను పరిశీలించారు. అనం తరం మద్దూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు, ఎస్పీ యోగేష్ గౌతమ్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లా కేంద్రంలోనీ ఎస్పీ ప్రధా న కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎస్‌బీ, డీసీ ఆర్‌బీ, హెడ్ క్వాటర్స్, అడ్మిన్ స్టోర్, ఆయు ధాలు, హోమ్‌గార్డ్, డాగ్‌స్క్వాడ్‌లకు సంబంధిం చిన రికార్డులను పరిశీలించారు. అనంతరం నారాయణపేట సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాల యాల రికార్డులను ఎస్పీతో కలిసి తనిఖీ చేశా రు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, సిబ్బం ది పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికా ర్డుల నిర్వహణపై శ్రద్ధ వహించాలన్నారు. వాటిని క్రమపద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమా దాలు జరిగే ప్రదేశాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పా రు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేద న్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహ రించాలని సూచించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, రామ్‌లాల్, రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు బాలరాజు, విజయ్ కుమార్, రాముడు, నరేష్, పురుషో త్తం, సునీత తదితరులు పాల్గొన్నారు.