మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:54 PM
మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ అన్నారు.
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్‌లో డ్రాగన్ షోటోకాన్ మహబూబ్‌నగర్ అర్బన్ అ ధ్యక్షుడు సీనియర్ కరాటే ఎస్‌కే మోసీన్ ఆధ్వ ర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీ సీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్య అతి థిగా హాజరై విద్యార్థులకు బెల్టులు ప్రదానం చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతీ ఒక్కరు కరాటే నేర్చు కోవాలన్నారు. కరాటేలో విద్యార్థులు రాష్ట్ర, జాతీ య స్థాయి ప్రతిభ చాటి పతకాలు సాధించాల న్నారు. బాలికల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, ప్రభుత్వం పాఠశాలలో బాలికలకు ప్రత్యేక కరా టే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 450 మంది వి ద్యార్థులు బెల్టు పరీక్షల్లో పాల్గొనగా, ప్రతిభ కన బరిచిన విద్యార్థులకు వివిధ విభాగాల్లో బెల్టులు ప్రదానం చేసినట్లు మాస్టర్ మోసీన్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెక్కరి మధుసూదన్‌రెడ్డి, డ్రాగన్ షోటోకాన్ ఫౌండర్ ఆల్ ఇండియా చీఫ్ సాలాం బిన్ ఉమర్, జాయింట్ సెక్రటరీ అంజన్‌ప్రసాద్, ఎగ్జామినర్ అమ్రేష్, హైదరాబాద్ అధ్యక్షుడు ఫయీం, కరాటే మాస్టర్లు మోసీన్, శేఖర్, అభిలాష్, రాకేష్, రాహుల్, యాసిన్, ఫలక్, గాయత్రీ, అయేషా పాల్గొన్నారు.