Share News

గడువులోపు పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 13 , 2025 | 11:08 PM

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.56 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పరిశీలించారు.

గడువులోపు పనులు పూర్తి చేయాలి
నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులపై అధికారులతో ఆరా తీస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- నూతన కలెక్టర్‌ భవన సముదాయ నిర్మాణ పనుల పరిశీలనలో కలెక్టర్‌

నారాయణపేటటౌన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.56 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. భవన నిర్మాణ మ్యాప్‌ను చూసి ఏ పనులు ఏ దశలో కొనసాగుతున్నాయని అధికా రులనడిగి తెలుసుకున్నారు. మరో ఆరు నెలలలోపు పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజేందర్‌రెడ్డి, డీఈ రాములు, ఏఈలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉన్నారు.

యాస్పీరేషన్‌ బ్లాక్‌పై సమీక్ష

యాస్పీరేషన్‌(పోషకాహారం, ఆరోగ్యం, విద్య) పై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సం బంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఆయా రంగాల్లో పనితీరు, సూచికల సంతృప్తికరణ కోసం కార్యాచరణ ప్రణాళిక, ప్రాజెక్టు ప్రతిపాదన తయారీ ఎంతవరకు వచ్చిందని అడిగారు. ప్రతీ రంగంలో ఫలితాల ఆధారిత, అత్యంత అవసరమైన ప్రతిపాదనను సమర్పించాలని కలెక్టర్‌ కోరగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ స్పందిస్తూ ప్రతీ రంగానికి బడ్జెట్‌ కేటాయింపు వివరాలను వెల్లడించారు. సమీక్షలో డీఆర్డీవో మొగులప్ప, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోహన్‌, డీఈవో గోవిందురాజులు, వైద్యశాఖ అధికారి భిక్షపతి, నర్వ యాస్పీరేషన్‌ బ్లాక్‌ ఇన్‌చార్జి బాలాజీ తదితరులున్నారు.

Updated Date - May 13 , 2025 | 11:08 PM