చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:02 PM
ప్రతీ ఒక్కరు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలనిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి డి.ఇందిర అన్నారు.
- జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర
భూత్పూర్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలనిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి డి.ఇందిర అన్నారు. మంగళవారం మునిసిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో ఉన్న మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె పాల్గొని, మాట్లాడారు. బాల్యవివాహల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలల, మహిళలకు ప్రాఽథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుగుణ, వైస్ ప్రిన్సిపాల్ రాధారాణి, పారాలీగల్ వలంటీర్లు శివన్న, నాగభూషణం, పల్లెమోని యాదయ్య పాల్గొన్నారు.