వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:14 PM
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకుని పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షే మ శాఖ అధికారి అక్బర్ పాషా విద్యార్థులకు సూచించారు.
- జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా
ధరూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకుని పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షే మ శాఖ అధికారి అక్బర్ పాషా విద్యార్థులకు సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి వసతి గృహంలోని పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆఫీస్, వంట గది, స్టోర్ రూమ్, విద్యార్థుల గ దులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు. కాసేపు విద్యారు ్థలతో కలిసి క్యారమ్స్, చెస్ బోర్డు ఆడారు. వసతి గృహ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఇటీవల జిల్లాలోని వసతి గృహాల్లో ఆహారం కలుషితమై న ఘటనలు చోటు చేసుకోవడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు అధికారి తెలిపారు.