Share News

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:13 PM

పదో తరగతి వార్షిక పరీక్షల్లో జి ల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా ర్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఉ పాధ్యాయులను ఆదేశించారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి విద్యావిభాగం,అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి వార్షిక పరీక్షల్లో జి ల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా ర్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఉ పాధ్యాయులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క లెక్టర్‌ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశమై ప దో తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రోగ్రెస్‌ రి పోర్టులను, హాజరును పరిశీలించారు. ఈ సంద ర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన గణిత పాఠ్యాంశాల పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అ దేవిధంగా జిల్లా కేంద్రంలోని హరిజనవాడకు చెందిన పలువురు ఉన్నత స్థాయికి చేరిన విద్యా ర్థులను కలెక్టర్‌ అభినందించారు. గ్రూప్‌-1 పరీక్ష లో డీఎస్పీగా ఎంపికైన గోర్ల సుమశ్రీ, ఎంబీబీ ఎస్‌లో సీటు సాధించిన దివ్య, నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన ఉదీప్‌లను కలెక్టర్‌ శాలు వాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌ ఘని, గంధం నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.

విద్యాశాఖ అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా: విద్యాశాఖ అధికా రులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్య వహరించాలని లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హెచ్చరిం చారు. బుధవారం కలెక్టరేట్‌లో ని కాన్ఫరెన్స్‌ హాల్లో ఆయన విద్యాశాఖ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంఈవోలు, క్లస్టర్‌ హె డ్మాస్టర్ల పాఠశాలల సందర్శన నివేదికను పరిశీలించారు.

సీఎంఆర్‌ పూర్తి చేసిన వారికే ధాన్యం కేటాయింపు

గత ఖరీఫ్‌ సీజన్‌ సీఎంఆర్‌ సమర్పించిన వారికే 2025-26 ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌తో కలిసి రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. నవం బరు 12వ తేదీ లోపు పెండింగ్‌ సీఎంఆర్‌ పూర్తి చేసి కొత్త ధాన్యం పొందడానికి సహకరించాలని సూచించారు.

Updated Date - Oct 15 , 2025 | 11:13 PM