Share News

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:50 PM

గత సంవ త్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిందని, ఈ సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ విజయేందిరబోయి విద్యార్థులకు సూచించారు.

వంద శాతం  ఉత్తీర్ణత సాధించాలి
మేళాలో బోధనా సామగ్రిని తిలకిస్తున్న కలెక్టర్‌

- మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి

మిడ్జిల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : గత సంవ త్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిందని, ఈ సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ విజయేందిరబోయి విద్యార్థులకు సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, మిడ్జిల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. పారిశుధ్య లోపం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయించాలని ఎంపీడీవో గీతాంజలి, పంచాయతీ కార్యదర్శి సాయన్నలను అదేశించారు.

మెనూ ప్రకారం విద్యార్ధులకు భోజనం అందించాలని, భోజనశాలను వినియోగంలోకి తేవాలని చెప్పారు. మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలను పంపించాలని అధికారులను అదేశించారు.

సృజనాత్మకత ప్రశంసనీయం

బోధనాభ్యసన సామగ్రి తయారీలో ఉపాధ్యాయుల సృజనాత్మకత, కృషి అభినందనీయమని కలెక్టర్‌ విజయేందిరబోయి అన్నారు. మండల కేంద్రం సమీపంలోని టీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యసన (టీఎల్‌ఎం) మేళాను ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో టీఎల్‌ఎం కార్నర్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, తహసీల్దార్‌ రాజు, ఉపాధ్యాయులు సుధాకర్‌, నర్సిములు, సందీప్‌, విజయ్‌భాస్కర్‌, సతీశ్‌, రమేశ్‌, విజయ్‌కు మార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:50 PM