Share News

వక్ఫ్‌బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:20 PM

వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా శుక్రవారం జడ్చర్లలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.

వక్ఫ్‌బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
జడ్చర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

జడ్చర్ల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా శుక్రవారం జడ్చర్లలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నిమ్మబావిగడ్డ మసీదు నుంచి జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేటలోని వివిధ మసీదుల నుంచి మధ్యాహ్నం నమాజ్‌ అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు అన్ని పట్టణంలోని సిగ్నల్‌గడ్డ చౌరస్తా వరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్‌బోర్డు చట్టంను సవరణ చేయడాన్ని ఖండించారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లిం మైనార్జీ సమాజాన్ని బలనహీన పరిచేలా కేంద్రం కుట్రపన్నుతోందని ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు చట్టం సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నయాబ్‌ తహసీల్దార్‌ కిశోర్‌కు వినతిపత్రం అందచేశారు.

Updated Date - Apr 18 , 2025 | 11:20 PM