Share News

హత్యాచారం కేసు నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:10 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని ఓ యువతిపై జరిగిన హత్యాచార ఘటన కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చే శారు. మూసాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ జానకి శనివారం వివరాలను వెల్లడించారు.

హత్యాచారం కేసు నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జానకి

వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి

మూసాపేట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని ఓ యువతిపై జరిగిన హత్యాచార ఘటన కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చే శారు. మూసాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ జానకి శనివారం వివరాలను వెల్లడించారు. నేరస్థుడు సంగు విష్ణుది సీసీకుంట మండ లంలోని ఓ స్వగ్రామం. అతని తండ్రి తిరుపతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య జయమ్మ మూసాపేట మండలంలోని ఓ గ్రామంలో ఉంటోంది. దాంతో విష్ణు తరుచుగా ఆ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్కడికి వచ్చిన విష్ణుకు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్‌ నెంబర్లు తీసుకుని, మాట్లాడుకునే వారు. విష్ణు ఈనెల 15న ఆ ఊరికి వచ్చాడు. 17న రాత్రి 8 గంటల సమయంలో యువతికి ఫోన్‌ చేసి గ్రామంలోని రైతు వేదిక వద్దకు రావాలని, మాట్లాడుకుందామని చె ప్పాడు. అక్కడికొచ్చిన ఆమెపై అత్యాచారం చేయడంతో సృహ తప్పింది. విషయాన్ని మృ తురాలి బంధువు ఒకరికి తప్పుగా చెప్పాడు. ఇద్దరు కలిసి రైతు వేదిక పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వరండాలో ఆమెను పడుకోబెట్టారు. మృతురాలి బంధువు, మరో ఇద్దరు కలిసి స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పల్స్‌ రేటు తగ్గిందని, అతను చెప్పాడు. వెంటనే తల్లికి సమాచారం ఇచ్చి, ఆటోలో జా నంపేట పీహెచ్‌సీకి తీసుకెళ్తున్నారు. మార్గం మధ్యలో 108 అంబులెన్స్‌ రావడంతో అందులో తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యసిబ్బంది మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈనెల 18న మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌తో ప్రత్యేక పోలీసు బృందం విచారించింది. నిందితుడిని శనివారం అరెస్టు చేసి, పలు రకాల చట్టాలతో కూడిన కేసును నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ఈ కేసు నిందితుడు, మృతురాలికి వ్యక్తిగతమేనని, ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేదని అన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, స్పెషల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, ఎస్‌ఐ ఎం.వేణు ఉన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 11:10 PM