గంగమ్మ తల్లికి ముదిరాజ్‌ల పూజలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:07 PM
ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని శుక్రవారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం
గద్వాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని శుక్రవారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు. నదీ అగ్రహారంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్బంగా జిల్లా అధ్యక్షుడు కబీర్‌దాస్ నర్సింహ మాట్లాడుతూ మత్స్య సంపద పెం పొందించాల్సి బాధ్యత మత్స్యకారులపై ఉందని అన్నారు. మత్స్య సంపద పెరిగితేనే మత్స్యకారు ల ఆర్థికాభివృద్ధి చెందుతారని వివరించారు ప్ర భుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు వర్గీకరణ చేయా ల్సి ఉందని దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట జనార్దన్, తాలూకా అధ్యక్షుడు టీఎన్‌ఆర్ జగదీశ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు అడ్వకేట్ పాండు, తాలూకా ప్రధాన కార్యదర్శి దడవాయి నర్సింహులు, కేకేభాయ్, చాపల చిన్న, ఫొటోగ్రాఫర్ బాలు, ఫ్లం బర్ జగదీశ్, శేషన్న, కేకే వెంకటన్న, సవరన్న, ఆటో ఆంజనేయులు, తిరుపతన్న, బంగి వసం త్, చిన్నశివ, నల్లన్న పాల్గొన్నారు.