Share News

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కదలిక

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:12 PM

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో క్రమంగా కద లిక వస్తుంది. ఫిబ్రవరి 22న దోమలపెంట వద్ద ఇన్‌లెట్‌లో ప్రమాదం జరిగిన తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి పునరుద్ధరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది.

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కదలిక
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (ఫైల్‌)

- నేడు నల్లమలలో ఎన్‌జీఆర్‌ఐ బృందంతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సర్వే

- గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దృష్ట్యా నిలిచిన పనులు

నాగర్‌కర్నూల్‌, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి) : ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో క్రమంగా కద లిక వస్తుంది. ఫిబ్రవరి 22న దోమలపెంట వద్ద ఇన్‌లెట్‌లో ప్రమాదం జరిగిన తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి పునరుద్ధరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇటీవల జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో బ్లాస్టింగ్‌ విధానంలో పనులను ముందుకు తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించిన విష యం తెలిసిందే. ఇందు కోసం ఎలక్ర్టో మాగ్నై టికల్‌ సర్వేకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ఇందు కోసం డీపీఆర్‌ను కూడా ఆమోదించింది. ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్‌లో టన్నెల్‌ కూలిన ప్రమాదంలో జయప్రకాశ్‌ ఇంజనీరింగ్‌, అమెరికాకు చెంది న రాబిన్‌ కంపెనీలకు చెందిన వారు 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు టన్నెల్‌లో జరిగిన అన్వే షణ అనేక కారణాలతో కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో గురుప్రీత్‌సింగ్‌, మనోజ్‌కుమార్‌ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా ఆరుగురి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. డేంజర్‌ జోన్‌ కంటే ముందుకె ళ్తే టన్నెల్‌లో మిగతా భాగాలు కూడా కుప్ప కూలి అన్వేషణ బృందాలకు కూడా ప్రాణ న ష్టం కలుగుతుందని జువాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణుల బృందం నివేదిక ఇవ్వ డంతో ప్రభుత్వం ముందడుగు వేయలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సో మవారం ఎన్‌జీఆర్‌ఐ బృందంతో కలిసి నిర్వ హించనున్న సర్వే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలకు సాగునీరందించి తమ నిబద్దతతను నిరూ పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధా లా కృషి చేస్తుంది. ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌, అవుట్‌లేట్లల్లో మిగిలి ఉన్న 9.135కిలో మీటర్ల టన్నెల్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పర్యా వరణానికి హానీ కలుగకుండా బ్లాస్టింగ్‌ విధా నాన్ని అవలంభించాలని భావిస్తున్న ప్రభు త్వం రేపు కీలకమైన సర్వేలో పర్యావరణ వేత్తలతో భాగస్వామ్యాన్ని పంచుకోనుంది.

Updated Date - Nov 02 , 2025 | 11:12 PM