Share News

వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:40 PM

వాహనదా రులు విధిగా హెల్మెట్‌ ధరిస్తే ప్రాణానికి ఎలాం టి ముప్పు ఉండదని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎస్పీ మొగులయ్య అన్నారు.

వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలి

జోగుళాంబ గద్వాల జిల్లా డీఎస్పీ మొగులయ్య

వడ్డేపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): వాహనదా రులు విధిగా హెల్మెట్‌ ధరిస్తే ప్రాణానికి ఎలాం టి ముప్పు ఉండదని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎస్పీ మొగులయ్య అన్నారు. శుక్రవారం మునిసిపాలిటీ కేంద్రమైన ఇంద్రానగర్‌కాలనీలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపితే ప్ర మాదాలకు గురై కుటుంబాలు చిన్నాభిన్నం అ వుతాయన్నారు. అదే సమయంలో వాహనదారు లు అన్ని పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ఇటీవల సైబర్‌ నేరాలు పెరిగిపో తున్న క్రమంలో ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా సెల్‌ఫోన్లకు వచ్చే మేసేజ్‌లకు స్పందించరాదన్నారు. సీఐ టాటా బాబు మాట్లాడుతూ డ్రగ్స్‌, పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అయితే పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ నాగశేఖ ర్‌ రెడ్డి తెలిపారు. అనంతరం వాహనదారులు, కాలనీవాసులతో హెల్మెట్‌ ధరించాలంటూ ప్ర తిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆయా మండాల ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్ళు ఉన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:40 PM