Share News

రూ.60 చీరతో అమ్మనే అవమానించారు

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:27 PM

అరవై రూపాయల చీరలను పంపిణీ చేసి తెలంగాణ మహిళలను అవమానించి న ఘనత బీఆర్‌ఎస్‌ నాయకులకే దక్కింద ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

రూ.60 చీరతో అమ్మనే అవమానించారు
ఆత్మకూరులో చీరలు పంపిణీ చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి

- రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

- మహిళలకు గౌరవం తెచ్చే సంస్కారం కాంగ్రెస్‌ ప్రభుత్వానిది

- ఆత్మకూరు, అమరచింత మండలాల అభివృద్ధికి అహర్నిశలు కృషి

- ఆత్మకూరులో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి

ఆత్మకూరు, నవంబరు22 (ఆంధ్రజ్యోతి) : అరవై రూపాయల చీరలను పంపిణీ చేసి తెలంగాణ మహిళలను అవమానించి న ఘనత బీఆర్‌ఎస్‌ నాయకులకే దక్కింద ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ ఎస్‌ హయాంలో చేనేత చీరలు పంపిణీ చే స్తామని చెప్పి ఇతర రాష్ట్రంలోని నాసిరకం చీరలను తూకంతో తీసుకువచ్చి పంపిణీ చేసి మహిళలను అవమాన పరిచారని అ న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహారాణులుగా చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని తెలి పారు. అదేవిధంగా ఆత్మకూరు నుంచి జో గుళాంబ గద్వాల జిల్లాకు కృష్ణానది మీదు గా వంతెన నిర్మాణానికి డిసెంబరు 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే రూ.90 కోట్ల వ్యయంతో రొయ్యల పెంపకం కేంద్రాలను ఆత్మకూరు, అమరచింత మం డల కేంద్రాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌, ఏపీఎం పారిజాతమ్మ, తహసీల్దార్‌ చాంద్‌ పాషా, ఎంపీడీవో శ్రీపాదు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:27 PM