Share News

విద్యుదాఘాతంతో తల్లీ కొడుకుల మృతి

ABN , Publish Date - May 01 , 2025 | 11:51 PM

పిండి గిర్ని నడుపుతుండగా విద్యుదా ఘాతానికి గురై తల్లీ కొడు కులు మృతి చెందారు.

విద్యుదాఘాతంతో తల్లీ కొడుకుల మృతి
మృతి చెందిన జయమ్మ, శ్రీకాంత్‌ (ఫైల్‌)

======================

- పిండిగిర్నీ నడుపుతుండగా ప్రమాదం

- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు - తుమ్మలసూగురులో విషాద ఛాయలు

తాడూరు, మే 1 (ఆంధ్రజ్యోతి):పిండి గిర్ని నడుపుతుండగా విద్యుదా ఘాతానికి గురై తల్లీ కొడు కులు మృతి చెందారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు మండ లంలోని తుమ్మలసూగురు గ్రా మంలో గురువారం ఉదయం జరిగిం ది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకా రం... గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి కుమారుడు శ్రీకాంత్‌(16) ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న పిండిగిర్నీ స్విచ్‌ ఆన్‌ చేశాడు. గిర్నీ నడుస్తుండగా దాన్ని ము ట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రాణా పాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతడిని తల్లి జయమ్మ (42) గమనించి, కాపాడేందుకు యత్నిస్తూ ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఆ సమయంలో పక్కనే ఉన్న కుమార్తె అంజలి అప్రమత్తమై మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. వెంటనే 108కు ఫోన్‌ చేసి స మాచారం అందించింది. అం బులెన్స్‌ వచ్చేలోగా జయమ్మ మృతి చెందింది. ఆమెతో పాటు కొనప్రాణంతో ఉన్న శ్రీకాంత్‌ను అంబులెన్స్‌లో నాగ ర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు కూడా మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనివాసాచారి కూలీ పనులు చేస్తుండగా, భార్య జయమ్మ ఇంట్లోనే పిండి గిర్నీ నిర్వహిస్తోంది. సంఘటనపై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గురుస్వామి తెలిపారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - May 01 , 2025 | 11:51 PM