బైకును కారు ఢీకొని.. త ల్లీకొడుకుల మృతి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:10 PM
తల్లి కాలుకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొని తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో చోటుచేసుకున్నది.
తల్లికి వైద్యం కోసం వెళ్లి వస్తుండగా ఘటన
కోయిలకొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : తల్లి కాలుకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొని తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై తిరుపాజీ తెలిపిన వివరాల ప్రకారం వీరన్నపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ(55) కాలుకు గాయం కావడంతో కుమారుడు బాల్‌రామ్ (35) బైక్‌పై జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. దమయపల్లి వద్ద కోయిలకొండ నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్న కారు ఎదురుగా అతివేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ బాల్‌రామ్ అక్కడికక్కడే మృతి చెందగా, ముత్యాలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్న మృతుడు బాల్‌రామ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.